యంగ్ హీరో మూవీ ట్రైల‌ర్‌కి అదిరిపోయే రెస్పాన్స్‌

Thu,January 18, 2018 03:34 PM
chalo trailer released

కెరీర్ తొలినాళ్ళ‌లో వైవిధ్య సినిమాల‌తో మెప్పించిన నాగ శౌర్య .. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఛ‌లో అనే రొమాంటిక్ డ్రామా మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్ర‌వరి 2న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, జ‌న‌వ‌రి 25 మూవీ ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌ప‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు. రష్మిక మందన ఈ మూవీలో క‌థానాయిక‌గా న‌టించింది. అయితే మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మూవీ యూనిట్ వినూత్న ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. జ‌నాల‌లోకి సినిమాని తీసుకెళ్ళేందుకు ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. యాక్ష‌న్‌తో పాటు కామెడీ నేప‌ధ్యంలో సినిమా ఉండ‌నున్న‌ట్టు ట్రైల‌ర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. తెలుగు .. తమిళుల మధ్య చోటుచేసుకునే పరిణామాలను ఈ ట్రైలర్ లో చూపించారు. హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి తమిళనాడులోని తిరుప్పురంకి వెళ్ళాడ‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. మ‌రి తాజాగా విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS