అల‌రిస్తున్న కార్తీ, ర‌కుల్ 'దేవ్‌' లిరిక‌ల్ వీడియో

Fri,December 14, 2018 11:33 AM
Chaliya Lyrical Video released

కోలీవుడ్ యాక్టర్ కార్తి నటిస్తోన్న చిత్రం ‘దేవ్’. రజత్‌ రవి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఖాకీ చిత్రం తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాకి హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కి మంచి స్పంద‌న ల‌భించింది. తాజాగా చెలియా అంటూ సాగే పాట‌కి సంబంధించిన లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేశారు. చంద్ర‌బోస్ ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, హ‌రిహ‌ర‌ణ్‌, భార‌త్ సుంద‌ర్‌, అర్జున్ చాంది, క్రిష్‌, శ‌ర‌ణ్య గోపినాథ్ క‌లిసి ఈ పాట ఆల‌పించారు. ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఈ చిత్రంకి దేవ్ అనే టైటిల్‌ని తన అభిమాన క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ స్ఫూర్తితోనే దర్శకుడు రజత్‌ రవి శంకర్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.

1875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles