రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ చ‌లాకి చంటి

Tue,June 18, 2019 08:53 AM
Chalaki Chanti met with an accident

గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌కి సంబంధించిన‌ హీరోలు గాయాల‌ బారిన ప‌డ‌డం తెలుగు సినీ అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌రపరుస్తుంది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, వ‌రుణ్ తేజ్‌, నాగ‌శౌర్య‌, శ‌ర్వానంద్‌, సందీప్ కిష‌న్ ఇలా యువ హీరోలు చిత్రీక‌ర‌ణ‌లో గాయ‌ప‌డ్డారు. తాజాగా జ‌బ‌ర్ధ‌స్ట్ న‌టుడు చ‌లాకి చంటి రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చంటికి గాయాలయ్యాయి. చంటి ప్రయాణిస్తున్న కారు .. లారీ వెనుక‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చంటిని కోదాడ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని అంటున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో చలాకీ చంటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి సినిమాల‌లోను అడ‌పాద‌డపా కనిపిస్తూ అల‌రిస్తున్నాడు. తెలుగు ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన న‌టులు ఇలా ప్ర‌మాదాల బారిన ప‌డుతుండ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

1863
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles