ప్రేమికుల‌కి గిఫ్ట్ ఇచ్చిన నితిన్‌

Wed,February 14, 2018 09:02 AM

ప్రేమిల‌కుల దినోత్స‌వం సంద‌ర్భంగా కొద్ది సేప‌టి క్రితం త‌న 25వ చిత్రం ‘చల్ మోహన రంగ’ టీజర్‌తో అభిమానుల‌ని సర్‌ప్రైజ్ చేశాడు నితిన్‌. ఎంతో అద్భుతంగా ఉన్న టీజ‌ర్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. వ‌ర్షాకాలంలో క‌లుసుకున్నమేము శీతాకాలంలో ప్రేమించుకొని, వేస‌వి కాలంలో విడిపోయాం అని నితిన్ అన‌గా, మీరిద్ద‌రు వెద‌ర్ రిపోర్ట‌ర్సా భ‌య్యా అంటూ ప‌లికిన డైలాగ్ సినీ ల‌వ‌ర్స్ ని ఆక‌ట్టుకుంటుంది. శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందించారు. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ‘చల్ మోహన రంగ’ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో షూటింగ్ జరుపున్న ఈ చిత్రానికి ఒక సాంగ్ మినహా దాదాపు షూటింగ్ పూర్తైంది. ఈ మిగిలిన ఒక్క గీతాన్ని ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నామని నిర్మాతలు తెలిపారు. తమన్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చుతున్న సంగ‌తి తెలిసిందే. న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు. అ..ఆ సినిమా త‌ర్వాత నితిన్ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.


2444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles