వాలంటైన్స్‌డేకి నితిన్ గిఫ్ట్ ఏంటో తెలుసా ?

Tue,February 13, 2018 01:49 PM
Chal Mohan Ranga Teaser gift on valentine day

జ‌యం సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన నితిన్, కెరియ‌ర్‌లో వైవిధ్య సినిమాలు చేస్తూ అభిమానుల గుండెల‌లో ల‌వ‌ర్‌బాయ్‌గా స్థానం సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్నాడు. ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా నటిస్తుంది. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, మూవీకి చ‌ల్ మోహ‌న్ రంగ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన మేక‌ర్స్‌, వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఉద‌యం 9గం.లకి టీజ‌ర్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు. అ..ఆ సినిమా త‌ర్వాత నితిన్ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక చ‌ల్ మోహ‌న్ రంగ సినిమా పూర్తైన వెంట‌నే దిల్ రాజు నిర్మాణంలో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేయనున్నాడు నితిన్‌. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles