ఛ‌ల్ మోహ‌న్ రంగ జ్యూక్ బాక్స్ విడుద‌ల‌

Sun,March 18, 2018 10:10 AM
Chal Mohan Ranga Songs Jukebox

శ్రేష్ట్‌ మూవీస్ పతాకంపై నితిన్ 25వ సినిమాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగ‌. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన ప‌లు సాంగ్స్ విడుద‌ల కాగా, ఇవి సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఇక ఉగాది శుభాకాంక్ష‌ల‌తో కొద్ది సేప‌టి క్రితం జ్యూక్ బాక్స్ విడుద‌ల చేశారు. అన్ని పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందించాడ‌ని తెలుస్తుంది. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేశారు. మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు. అ..ఆ సినిమా త‌ర్వాత నితిన్ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.


1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles