ఛ‌ల్ మోహ‌న్ రంగ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌

Wed,February 21, 2018 11:07 AM

యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగ‌. శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ క‌థానాయిక‌గా న‌టించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందించారు. ప్రస్తుతం ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ‘చల్ మోహన రంగ’ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఓ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకుంటున్న‌ట్టు స‌మాచారం. తమన్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చుతుండ‌గా, మూవీలోని తొలి సాంగ్‌ని ఫిబ్రవ‌రి 24న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు. అ..ఆ సినిమా త‌ర్వాత నితిన్ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.1704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles