ఛ‌ల్ మోహ‌న్ రంగ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌

Sat,February 24, 2018 10:03 AM
Chal Mohan Ranga first single released

శ్రేష్ట్‌ మూవీస్ పతాకంపై నితిన్ 25వ సినిమాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగ‌. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనికి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ రోజు మూవీ ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల అయింది. ఘ.. ఘ.. మేఘా.. అంటూ సాగే ఈ సాంగ్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కి మ‌త్తెక్కిస్తుంది. త‌మ‌న్ కంపోజ్ చేసిన ఈ పాటని రాహుల్ నంబియార్‌ పాడారు. చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందించాడ‌ని తెలుస్తుంది. హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఓ సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేశారు. న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు. అ..ఆ సినిమా త‌ర్వాత నితిన్ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

2091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles