చైతూ హీరోగా మారుతి మూవీ.. ముహూర్తం ఫిక్స్‌

Fri,November 24, 2017 12:14 PM
chaitu new movie launched tomorrow

ఒక‌ప్పుడు యూత్ ఫుల్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న మారుతి ప్ర‌స్తుతం కుటుంబ క‌థా చిత్రాల‌ని తెర‌కెక్కిస్తున్నాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన ఈ డైరెక్ట‌ర్ వెంకీ తో బాబు బంగారం అనే చిత్రాన్ని తీశాడు. ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి మారుతి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ని ప‌లువురు ప్ర‌శంసించారు. రీసెంట్‌గా మ‌హానుభావుడు అనే చిత్రాన్ని తీశాడు. ఈ మూవీ మంచి విజ‌యం సాధించింది. ఇక త‌న త‌దుప‌రి చిత్రాన్ని యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో చేయ‌నున్నాడు మారుతి. ఈ మూవీ రేపు ఉద‌యం 11గంట‌ల‌కు లాంచ్ కానుండ‌గా, జ‌న‌వ‌రి 5 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు మారుతి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. చైతూ- మారుతి కాంబోలో తెర‌కెక్క‌నున్న చిత్రాన్ని ప్రేమ‌మ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ రూపొందించ‌నుంది. ప్ర‌స్తుతం చైతూ స‌వ్య‌సాచి అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీ చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles