'మ‌జిలి' నుండి నాగ చైత‌న్య లుక్ విడుద‌ల‌

Fri,November 23, 2018 10:42 AM
chaitu new look goes viral

అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య ఇటీవ‌ల శైల‌జా రెడ్డి అల్లుడు, స‌వ్య‌సాచి అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు నిరాశ ప‌ర‌చాయి. ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న స‌తీమ‌ణి స‌మంత‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం మ‌జిలీ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటుంది.పెళ్ళి త‌ర్వాత తొలిసారి నాగ చైత‌న్య‌, స‌మంత కాంబినేష‌న్‌లో మూవీ వ‌స్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రీసెంట్‌గా ఈ చిత్రం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, త‌ర్వాతి షెడ్యూల్‌ని హైద‌రాబాద్‌లో జ‌రుపుకోనుంది. ఈ రోజు నాగ చైత‌న్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ చైతూ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది. ఇందులో స్కూట‌ర్‌పై చిన్న స్మైల్‌తో న్యూ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుత‌న్న‌ నాలుగో చిత్రం మ‌జిలి. ఈ చిత్రంలో సామ్‌, చైతూలు భార్య భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నారు. చైతూ మాజీ క్రికెట‌ర్‌గా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. స‌మంత క్ల‌ర్క్ పాత్ర పోషించింద‌ని అంటున్నారు. నటుడు సుబ్బరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్‌ చేయాలని టీమ్‌ నిర్ణయించుకుందట. వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. హ‌రీష్ పెద్ది, సాహు గ‌ర‌పాటి సంయుక్తంగా షైన్ స్క్రీన్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

1600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles