స‌మంత సినిమాలు చేయ‌ద‌నే వార్త అవాస్త‌వం అన్న చైతూ

Tue,July 10, 2018 09:27 AM
chaitanya gives clarity on samantha movie

ద‌క్షిణాదిలోని టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుంద‌నే ఓ వార్త ఇటీవ‌ల దావానంలా పాకిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌థ‌మార్ధంలో అద‌రగొట్టి ద్వితీయార్ధంలో ప‌లు సినిమాల‌తో ప‌ల‌క‌రించేందుకు సిద్ద‌మైన ఈ అమ్మ‌డు త‌ర్వాత సినిమ‌లు చేయ‌ద‌నే స‌రికి అభిమానులు షాక్ అయ్యారు. దీనిపై సమంత ఏమైన స్పందిస్తుందేమోన‌ని ఆశ‌గా ఎదురు చూశారు. కాని తాజాగా ఈ విషయంపై నాగచైతన్య స్పందించాడు. స‌మంత సినిమాల‌కి పూర్తిగా దూరం అవుతుంద‌ని వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అన్నారు. త‌న‌కు ఇష్ట‌మైన ఈ రంగం నుండి ఆమె బ‌య‌ట‌కి వెళ్ళే ఛాన్స్ లేద‌న్న‌ చైతూ అవ‌స‌రాన్ని బ‌ట్టి అప్పుడ‌ప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటుందేమో అని పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. చైతూ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కూడా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది. ఇక చైతూ స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

2527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles