మ‌న్మ‌థుడు2 చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు ఫిక్స్..!

Tue,February 19, 2019 12:14 PM
Chaitan Bharadwaj selected music director for manmadhu 2

కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం మన్మథుడు . ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నాగార్జున వున్నారు . ఆయన సొంత బ్యానర్లోనే ఈ సినిమా నిర్మితం కానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండ‌డంతో పాయ‌ల్ రాజ్‌పుత్‌ని ఒక క‌థ‌నాయిక‌గా ఎంపిక చేశార‌ట‌. మార్చి మొదటి వారం నుండి ఈ చిత్రం తొలి షెడ్యూల్ పోర్చుగ‌ల్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, ఎక్కువ శాతం చిత్రీక‌ర‌ణ యూర‌ప్‌లో జ‌ర‌ప‌నున్నారని తెలుస్తుంది. అయితే చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల వ‌స్తున్న వార్త‌లు అభిమానులు షాక్ అయ్యేలా చేస్తున్నాయి. తాజాగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మ‌న్మ‌థుడు 2 చిత్రానికి సంగీతం అందించనున్నాడని సమాచారం. ఆర్ఎక్స్ 100 చిత్ర సంగీతం న‌చ్చ‌డంతో నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది.

1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles