007 కిస్సులకు సెన్సార్ బ్రేక్

Thu,November 19, 2015 09:23 AM
censor board deletes spectre kissing scenes

ముంబై : బాండ్ . జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ 007. అది బ్రిటన్ వరకే. అతనేమి చేసిన క్వీన్ ముందే చెల్లుతుంది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో అతను చెప్పిందే రైట్. కానీ ఆ ఏజెంట్ వేషాలు ఇక్కడ చెల్లవట. జేమ్స్ బాండ్ స్పెక్టర్ జోరుకు ఫిల్మ్ బోర్డు బ్రేకేసింది. ఆ సినిమాలో 007 హాట్ సీన్లకు సీబీఎఫ్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. డానియల్ క్రేగ్ నటించిన బాండ్ సినిమా స్పెక్టర్‌లో ఉన్న కిస్సింగ్ దృశ్యాలను నిర్ధాక్షిణ్యంగా సగానికి సగం తగ్గించింది.

జేమ్స్ బాండ్ సీక్వెల్ స్పెక్టర్ ఇవాళ ఇండియాలో విడుదలవుతోంది. ఆ మూవీలో హీరో డానియల్ క్రేగ్, హీరోయిన్ మోనికా బెలుస్కీ మధ్య హాట్ కిస్సింగ్ సీన్లున్నాయి. ఈ ఇద్దరూ ఆ సీన్లలో రెచ్చిపోయారు. కిక్కెక్కించే కిస్సులున్నాయట. అయితే ఆ డోసును కాస్త తగ్గించింది మన సెన్సార్ బోర్డ్. మరీ అంత రోమాన్స్ అవసరం లేదంటూ కొన్ని సీన్లను తొలిగించారు.

LatestNews


గాఢంగా ముద్దుపెట్టుకునే దృశ్యాలు అతి సుదీర్ఘంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. అందుకే ఆ సీన్లను 50 శాతానికి తగ్గించినట్లు బోర్డు పేర్కొంది. 51 ఏళ్ల బెలుస్కీ స్పెక్టర్‌లో హాట్ సన్నివేశాలను రసవత్తరంగా పండించింది. ఇటలీకి చెందిన ఈ హాలీవుడ్ భామ ఈ సినిమాలో మాఫియా డాన్ భార్యగా నటించింది. ఓ బెడ్ రూమ్ సీన్‌లో ఇద్దరూ ముద్దుల్లో తేలిపోతారు. అయితే అది రెగ్యులర్ లిప్ లాక్‌లా లేదట. ఆ సన్నివేశంలో చాలా గాఢంగా తమ ప్రేమను వ్యక్తపరిచారట. వామ్మో ఈ ముద్దులు మనకొద్దంటూ సెన్సార్ బోర్డు ఆ డెడ్లీ కిస్సులను డిలీట్ చేసింది.

ఒక్క కిస్ సీన్లే కాదు. కొన్ని డైలాగ్‌లను కూడా కట్ చేశారు. అక్కడక్కడ బాండ్ భాష సరిగా లేదంటూ సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది. స్పెక్టర్‌లో నాటు డైలాగులున్న సీన్లను కూడా తొలిగించినట్లు బోర్డు సభ్యుడొకరు తెలిపారు.

4328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles