శ్రీదేవి కూతురు డెబ్యూ మూవీపై సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు

Fri,July 20, 2018 01:19 PM
celebs praise on dhadak movie

శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ డెబ్యూ చిత్రం ద‌ఢ‌క్ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. శ‌శాంక్ కైతాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్ సోదరుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ ఇందులో క‌థానాయకుడిగా న‌టించాడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రం మ‌రాఠీ మూవీ సైర‌త్‌కి రీమేక్‌గా రూపొందింది. రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుందని రిలీజ్ ముందు నుండే మేక‌ర్స్ చెబుతున్నారు. నిన్న ఈ మూవీ స్పెష‌ల్ స్క్రీనింగ్ జ‌రుపుకోగా, బాలీవుడ్ సెల‌బ్రిటీలు అర్జున్ క‌పూర్‌, సోన‌మ్ క‌పూర్‌, అనీల్ క‌పూర్‌, వ‌రుణ్ ధావ‌న్ త‌దిత‌రులు వీక్షించారు. సినిమాపై ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపించారు. జాన్వీ, ఇషాన్‌ల న‌ట‌న బాగుంద‌ని అన్నారు. బాలీవుడ్ న‌టి రేఖ ఇషాన్‌, జాన్వీల‌ని కౌగిలించుకొని అభినందించింది. ద‌ఢ‌క్ చిత్రంపై సెల‌బ్రిటీలు చేసిన కామెంట్స్‌పై మీరు ఓ లుక్కేయండి.

4205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles