ప్రియాంక పార్టీలో మెరిసిన బాలీవుడ్ సెల‌బ్స్

Sun,August 19, 2018 08:40 AM
celebs at Priyanka Chopra And Nick Jonas Engagement Party

గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా త‌న‌క‌న్నా ప‌ది సంవ‌త్స‌రాలు చిన్న‌వాడైన నిక్ జోనాస్‌తో శ‌నివారం( ఆగ‌స్ట్ 18 న) నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లు అభిమానుల‌లో ఉన్న అనుమానాల‌కి నిన్న జ‌రిగిన నిశ్చితార్ధం పులిస్టాప్ పెట్టేసింది. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ప్రియాంక చోప్రా ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీస్‌కి ముంబైలోని ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. అలియా భ‌ట్, ముఖేష్ అంబానీ, నీతా, ఇషా అంబానీ, ప్రియాంక క‌జిన్ పరిణితీ చోప్రా, స‌ల్మాన్ సిస్ట‌ర్ అర్పిత ఖాన్‌, నిర్మాత సిద్ధార్ద్ రాయ్ క‌పూర్‌, ఫిలిం మేక‌ర్ విశాల్ భ‌ర‌ద్వాజ్‌, త‌దిత‌రులు పార్టీకి హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌లోనే త‌న పెళ్లి తేది విష‌యంపై ప్రియాంక అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని అంటున్నారు.ముంబైలో రోకా ఫంక్షన్‌తో అధికారికంగా మేమిద్దరం ఒక్కటౌతున్నాం అని చెప్పేశారు ప్రియానిక్ జంట‌. త‌మ పెళ్లి కార‌ణంగా భార‌త్ అనే సినిమా నుండి కూడా త‌ప్పుకుంది ప్రియాంక‌. ఆమె స్థానంలో క‌త్రినాని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన విష‌యం విదిత‌మే.
1757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles