ఈషా అంబానీ పెళ్లిలో సెలబ్రిటీల సందడి..

Wed,December 12, 2018 05:56 PM
Celebs At Isha Ambani And Anand Piramal's Wedding In Mumbai

ముకేశ్ అంబానీ కూతురు ఈషా పెళ్లి వేడుకలు ముంబైలోని ముకేశ్ ఇంట్లో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. నీతా, ముకేశ్ అంబానీ తమ కూతురు పెళ్లి వేడుకలను ఘనంగా జరిపిస్తున్నారు. పెళ్లిలో పలువురు సినిమా, వ్యాపార ప్రముఖులు సందడి చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, కూతురు శ్వేత, మనవరాలు నవ్యా నవెలి.. ఈషా పెళ్లికి హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్, ప్రముఖ నటి కైరా అద్వానీ, ఫ్యాషన్ డిజైన్ మనిశ్ మల్హోత్రా, కోరియోగ్రాఫర్ వైభవి మర్చంట్, ఇతర ప్రముఖులు ఈషా పెళ్లితో సందడి చేశారు.

ముకేశ్ అంబానీకి ఈషా ఒక్కతే కూతురు. ఆకాశ్, అనంత్ కొడుకులు. ఈషా.. పిరమాల్ గ్రూప్ అధినేత అజయ్ పిరమాల్ కొడుకు ఆనంద్ పిరమాల్‌ను వివాహం చేసుకోబోతున్నది. ఈషా, ఆనంద్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఉదయ్‌పూర్‌లో జరిగాయి. వీళ్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. వేడుకల్లో పాప్ సింగర్ బెయాన్స్ కూడా పర్‌ఫార్మ్ చేసింది. హిల్లరీ క్లింటన్ కూడా ఉదయ్‌పూర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నది.

ఆనంద్.. గత మేలో ఈషాను మహాబలేశ్వర్‌లో ప్రపోజ్ చేయగా.. ఆయన ప్రపోజల్‌కు ఈషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్ల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో గత సెప్టెంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో వాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగింది. వాళ్ల ఎంగేజ్‌మెంట్‌కు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.








View this post on Instagram

Precious pic 🥰!! The first time in my life that i asked to be introduced to someone...Thank you @smritiiraniofficial for the same 🙂. I loove @hillaryclinton ♥️. A woman who has weathered every storm with equanimity and who never gives up...I felt hopeful while she campaigned to be #President and felt a certain hopelessness when she didn’t make it...But in a few days i realized that only when the glass ceiling is shattered can we reach the sky and she broke it for us...and thus paved the way for someone else to reach for the boundless blue. You may find many reasons to dislike her but that’s because you are judging her because she dared to travel where most don’t...Thank you @hillaryclinton for all that you are and for being a HERO ☀️!! And thank you my #siddharthroykapur for being a walking talking encyclopedia on American politics and for thereby introducing me to Her 🙂. I couldn’t have imagined waking up at 6am to watch the primaries until you happened to me 😜.

A post shared by Vidya Balan (@balanvidya) on

2849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles