43 ఏళ్ళ హీరోకి సెల‌బ్రిటీల విషెస్

Thu,June 22, 2017 12:12 PM
celebrities wishes to vijay

కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి ఈ రోజు 43వ పడిలోకి అడుగు పెట్టాడు. ల‌క్ష‌లాది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో బ‌ర్త్ డే సంద‌ర్భంగా అభిమానులు ఆయ‌న పేరు మీద అన్న దానాలు, ర‌క్త‌దానాలు చేస్తున్నారు. కొన్ని ప్ర‌దేశాల‌లో భారీ కటౌట్స్ ప్ర‌ద‌ర్శించి విజ‌య్ పై త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక సెల‌బ్రిటీలు కూడా విజ‌య్ కి స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. నిన్న‌టి నుండే విజ‌య్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ కాగా ఈ త‌మిళ హీరో త‌న సినిమాకి సంబంధించి రెండు లుక్స్ విడుద‌ల చేసి ఫ్యాన్స్ లో ఆనందాన్ని పీక్స్ కి తీసుకెళ్లాడు. విజ‌య్ చేస్తున్న 61 వ సినిమాకి మెర్స‌ల్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, తాజాగా విడుద‌లై పోస్ట‌ర్ లో పందెపు ఎద్దుల ముందు గ్రామీణ యువకుడిగా నిలబ‌డి పక్కా మాస్ లుక్ తో ఉన్నాడు విజ‌య్ . ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ మూవీతో తెర‌కెక్కుతుందని తెలుస్తుండ‌గా, ఈ చిత్రంలో నిత్యామీన‌న్, కాజ‌ల్ అగ‌ర్వాల్, స‌మంత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థార‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్న ఈ మూవీకి ఎఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు.
1683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles