రికార్డ్స్ కుమ్ముడే అంటున్న బన్నీ

Wed,January 11, 2017 01:13 PM
రికార్డ్స్ కుమ్ముడే అంటున్న బన్నీ

సంక్రాంతి పండుగకు ముందు మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వచ్చిన ఖైదీ నెం 150 ఫీవర్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 9ఏళ్ల తర్వాత చిరుని వెండితెరపై చూసిన అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది. ఆయన వేసే స్టెప్పులకు థియేటర్లు మారు మ్రోగాయి. ఇక ఫైట్ సన్నివేశాలలో బాస్ బ్యాక్ అనేలా ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే చిరు ఎంట్రీని ఇటు అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు స్వాగతించారు. ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. అల్లు అర్జున్ అయితే అమ్మడు లెట్స్ డూ రికార్డు కుమ్ముడూ అంటూ తన ఆనందాన్ని ఇలా వ్యక్త పరచాడు. నాగార్జున, మోహన్ బాబు, శిరీష్, నిఖిల్, నిషా అగర్వాల్, రామ్ పోతినేని, హరీష్ శంకర్ తదితరులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. మెగా ఫ్యామిలీ నుండి నాగేంద్రబాబు, సురేఖ, బన్నీ, స్నేహా రెడ్డి పలు థియేటర్స్ లో సందడి చేశారు.

2360
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS