రోల్‌మోడల్‌గా ఉండటం చాలా ముఖ్యం..

Tue,August 14, 2018 05:27 PM
celebrities to be good role models is important says Mahesh Babu

సమాజంలో సెలబ్రిటీలను ఎంతోమంది అభిమానులు, ప్రజలు ఫాలో అవుతారనే విషయం తెలిసిందే. సెలబ్రిటీలపై చాలా బాధ్యత ఉంటుందని, వాళ్లు ఎంతోమందికి రోల్‌మోడల్‌గా ఉండాలని అంటున్నాడు టాలీవుడ్ యాక్టర్ మహేశ్‌బాబు. మహేశ్‌బాబు తాజాగా వంశీపైడిపల్లితో 25వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

ఇటీవలే మీడియాతో చిట్ చాట్ చేశాడు మహేశ్. వ్యక్తిగా మంచి పనులు చేస్తే నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఫీలవుతారు. మిమ్మల్ని ఇష్టపడతారు. అయితే ఓ సెలబ్రిటీగా ఉన్నపుడు ప్రజలకు మంచి సందేశం ఇవ్వడమనేంది చాలా ముఖ్యమైన విషయం. చాలా మంది ఫాలోవర్లు ఉండే సెలబ్రిటీలు..వారిని అభిమానించే వారికి, ప్రజలకు రోల్‌మోడల్‌గా ఉండటం పెద్ద బాధ్యత. అభిమానుల ఆదరణ, ప్రేమతో ఈ స్థాయికి చేరాను. నా బాధ్యతలను ఎప్పటికీ మర్చిపోను అంటూ చిట్‌చాట్‌లో చెప్పాడు ప్రిన్స్.

2802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles