రామ‌ల‌క్ష్మికి టాలీవుడ్ సెల‌బ్రిటీల ప్ర‌శంస‌లు

Fri,February 9, 2018 01:40 PM
celebrities praise rama lakshmi

సుకుమార్ ద‌ర్శక‌త్వంలో ప‌ల్లెటూరి నేప‌థ్యంతో తెర‌కెక్కిన చిత్రం రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన ఈ చిత్రంలో చెర్రీ చిట్టి బాబు పాత్ర పోషించ‌గా, స‌మంత రామల‌క్ష్మిగా క‌నిపించ‌నుంది. కొద్ది సేప‌టి క్రితం రామ‌ల‌క్ష్మి పాత్రకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌మంత లంగావోణి క‌ట్టుకొని వాలు జ‌డ‌తో వ‌య్యారంగా న‌డిచి వ‌స్తుంటే అభిమానుల హృద‌యాలు రెట్టింపు వేగంతో కొట్టుకున్నాయి. ఫ్యాన్స్‌నే కాదు సెల‌బ్రిటీస్‌ని కూడా టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. టీజ‌ర్‌లో ‘ఓహోహోహో.. ఏం వయ్యారం ఏం వయ్యారం. ఏ మాటకామాట సెప్పుకోవాలిగానండీ ఈ పిల్ల ఎదురొత్తుంటే మా ఊరుకే 18 సంవత్సరాల వయసొచ్చినట్టు ఉంటదండి. ఈ చిట్టిబాబు గుండెకాయని గోలెట్టించేసింది ఈ పిల్లేనండి. పేరు రామలక్ష్మండి. ఊరు రంగస్థలం’.. అంటూ రామలక్ష్మిని చిట్టిబాబు పరిచయం చేసేశాడు. టీజర్‌లో చాలా స్పెష‌ల్‌గా క‌నిపించిన రామ‌ల‌క్ష్మిని అక్కినేని స‌మంత మ‌రిది అక్కినేని అఖిల్ సూప‌ర్ స్టార్ స‌మంత అంటూ చ‌ప్పట్టు కొడుతూ అభినందించాడు. ఇక ర‌కుల్ ప్రీత్‌.. రామ‌ల‌క్ష్మీని స్క్రీన్‌పై చూడాల‌ని ఉంద‌ని కామెంట్ పెట్టింది. రామలక్ష్మి.. సమంత కెరీర్‌కే ది బెస్ట్ క్యారెక్టర్ అని షాలిని పాండే ట్వీట్ చేయ‌గా , ఉఫ్.. రామలక్ష్మి నా హృదయాన్ని ఎక్కడికో తీసుకెళ్లావ్ అంటూ మెహ్రీన్ ఫిర్జాదా ట్విట్ట‌ర్ లో తెలిపింది. కోన వెంక‌ట్ తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా కూడా స‌మంత‌ని అభినందించారు. రంగ‌స్థ‌లం చిత్రం మార్చి 30న థియేట‌ర్స్‌లోకి రానున్న సంగ‌తి తెలిసిందే.


3038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles