'మహానటి'పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సెలబ్రిటీస్

Wed,May 9, 2018 03:21 PM
celebrities praise mahanati

టాలీవుడ్ లో తొలిసారిగా ఓ నటిపై బయోపిక్ తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవిత నేపథ్యంలో మహానటి టైటిల్ తో మూవీ తెరకెక్కగా ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, మధురవాణి పాత్రలో సమంత, విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. దాదాపు 18 నెలల పాటు ఈ సినిమాని చిత్రీకరించిన యూనిట్ నేడు తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసింది. మే 11న తమిళంలో ‘నడిగర్ తిలగమ్’ అనే టైటల్ తో విడుదల కానుంది.

ఎన్నో అంచనాల విడుదలైన మహానటి చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపించేలా చేసిన దర్శక ధీరుడు రాజమౌళి గొప్ప చిత్రం తీసారంటూ నాగ్ అశ్విన్, స్వప్నలని అబినందించాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. అనుకరిస్తున్నట్టు కాకుండా అద్భుతంగా నటించింది. నేను చూసిన అద్భుత పర్ఫార్మెన్స్ లలో కీర్తి సురేష్ ది ఒకటిని కొనియాడారు. సావిత్రిని మళ్ళీ మన ముందుకు సజీవంగా తీసుకొచ్చింది కీర్తి. దుల్కర్ నటన అద్భుతంగా ఉంది. ఇప్పుడు అతనికి నేను ఫ్యాన్స్ గా మారిపోయనంటే ట్వీట్ చేశాడు రాజమౌళి.

మహానటి చిత్రాన్ని వీక్షించిన రాఘవేంద్రరావు కూడా సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. సరిగ్గా ఇదే రోజు (మే 9)న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదలైందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘28 ఏళ్ళ క్రితం ఇదే రోజున భారీ వర్షం... చాలా పెద్ద సినిమా తీశాం అనే ఆనందం, ఎలా ఆడుతుందో అనే భయం. ఎప్పుడు వరద ఆగుతుందో అని ఎదురుచూపు... ఎట్టకేలకు సాయంత్రం నుంచి సినిమా హాళ్ల వైపు జనాలు కదిలారు... మరుసటి రోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో రావడం మొదలైంది. మా దత్తు గారికి (అశ్విని దత్‌) ఆ రోజు ఎంత ఆనందం కల్గిందో ఇప్పటికీ మర్చిపోలేను’. ‘ఇప్పుడు అదే రోజున ‘మహానటి’ విడుదలైంది.

ఆ రోజున(మే 9)న ‘జగదేక వీరుడు అతిలోకసుందరి’ నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో నేడు ‘మహానటి’ నిర్మించడానికి అంతే ధైర్యం కావాలి. సావిత్రి గారి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమాకీ, వైజయంతి మూవీస్‌కీ ధన్యవాదాలు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ జీవించింది‌. శివాజీ గణేశన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటన అద్భుతం. నాగ్‌ అశ్విన్, చిత్ర యూనిట్‌కి నా అభినందనలు’ అని రాఘవేంద్రరావు వరుస ట్వీట్లు చేశారు. ఇక సావిత్రి కూతురు చాముండేశ్వరి మహానటి సినిమాపై స్పందిస్తూ.. అమ్మ చిన్నతనం నుండి టాప్ హీరోయిన్‌ గా మారడం వరకు ప్రతీది సినిమాలో చూడటం సంతోషంగా ఉంది. అమ్మే నాలో ఉండి తన కథని ఇలా చిత్ర రూపంలో చేయించుకుంది. కీర్తి సురేష్ చక్కగా నటించారు. నాన్నగా దుల్కర్‌ చాలా బాగా అనుకరించారు అని పేర్కొంది.

తమిళ డైరెక్టర్ అట్లీ మహానటి చిత్రంపై స్పందించాడు. మహానటి క్లాసిక్, ఎమోషనల్, ఇన్సిపిరేషనల్‌ బయోపిక్ అని అన్నాడు. కీర్తి లెజండరీ యక్ట్రెస్ సావిత్రి అమ్మని మనముందుకు తీసుకొచ్చింది. సమంత మాయాబజార్ డ్యాన్స్ అదిరింది. ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు వైజయంతి ఫిలింస్ కి ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు. ఇక సమంత ఇలాంటి క్లాసిక్ చిత్రంలో భాగం అయినందుకు సంతోషం వ్యక్తం చేసింది. దుల్కర్ సల్మాన్ కూడా చిత్ర విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు.

మహానటి చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటించగా, కేవీ రెడ్డి పాత్రలో క్రిష్, ఎల్వీ ప్రసాద్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, దర్శకనిర్మాత చక్రపాణి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించారు . ఇక సావిత్రి పెదనాన్న కేవి చౌదరి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, అలమేలు పాత్రలో మాళవిక నాయర్ దర్శనమిచ్చారు. ఇక అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించిన షాలిని పాండే నటి సుశీల పాత్రలో కనిపించారు. ఏఎన్ ఆర్ పాత్రలో నాగ చైతన్య కనిపించారు.

4634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles