ఈ సినిమా ఎవ‌రిది?.. మ‌న‌ది

Tue,August 21, 2018 01:26 PM
celebrities praise actor syeraa teaser

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న సైరా చిత్ర టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. చిరు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. అభిమానులే కాదు సినీ సెల‌బ్రిటీలు కూడా టీజ‌ర్‌ని చూసి షాక్‌లో ప‌డ్డారు. న‌ర‌సింహ‌రెడ్డి లుక్‌లో చిరుని చూసి ప్ర‌తి ఒక్క‌రు నోళ్ళెళ్ల‌పెట్టారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, ర‌త్న‌వేలు ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. వచ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రం కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో రూపొందుతుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం చిరు జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయేలా ఉంటుంద‌ని చెర్రీ అన్నారు. నిమిషంన్న‌ర పాటు ఉన్న టీజ‌ర్‌ని చూసి సెల‌బ్రిటీలు త‌మ అభిప్రాయాల‌ని ప‌లు విధాలుగా వ్య‌క్తం చేశారు.

'ఈ యుద్ధం ఎవరిది .. మనది' అంటూ టీజ‌ర్‌లో చిరూ చెప్పిన డైలాగ్ .. ఈ సినిమా రిలీజ్ వరకూ అభిమానుల మ‌న‌సుల‌లో ప‌దిలంగా నిలిచిపోయేలా ఉంది. ఇదే డైలాగ్‌ని నాని త‌న‌దైన స్టైల్‌లో .. "ఈ సినిమా ఎవరిది .. ? మనది" అంటూ తన ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు . 'టీజర్ కిర్రాక్ వుంది లే' అంటూ విజయ్ దేవరకొండ అన్నాడు. మాట‌లు లేవు.. సెల‌బ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి అంటూ బ‌న్నీ కామెంట్ చేయ‌గా, రోమాలు నిక్క‌పొడుచుకుంటున్నాయి అని వ‌రుణ్ ట్వీట్ చేశాడు. ఇక సినిమా కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నాను. అత‌ని క‌ళ్లు ఎన్నో మాట్లాడుతున్నాయి. ఇంత మంచి బ‌హుమ‌తి ఇచ్చినందుకు రామ్‌చ‌ర‌ణ్‌, సురేంద‌ర్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు అని తేజూ కామెంట్ చేశాడు. కోన వెంక‌ట్‌, అనీల్ రావిపూడి, అనసూయ త‌దిత‌రులు సైరా టీజ‌ర్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

4099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles