హోలీ శుభాకాంక్ష‌ల‌ని వినూత్నంగా తెలియ‌జేసిన మెగా హీరో

Thu,March 21, 2019 11:46 AM

ఈ రోజు దేశ వ్యాప్తంగా హోలీ సంబ‌రాలు అంబ‌రాన్నంటుతున్నాయి. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కి రంగులు పులుముకుంటూ ప్ర‌తి ఒక్క‌రు స‌ర‌దాగా హోలీ సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. రంగు రంగుల హోలీ అంద‌రి జీవితాల‌ని రంగుల‌మ‌యం చేయాల‌ని శ్రేయోభిలాషులు కోరుతున్నారు. ఇక సెల‌బ్రిటీలు సైతం త‌మ సోష‌ల్ మీడియా ఎకౌంట్ ద్వారా హోలీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, ప్ర‌జ‌లకి సందేశాన్ని ఇస్తున్నారు. మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఓ పిల్లికి పాలు పోస్తూ , హోలీ రంగుల‌ వ‌ల‌న జంతువుల‌కి హాని క‌ల‌గ‌కుండా చూడండి. ప్లే గ్రీన్‌, ప్లే క్లీన్ అంటూ త‌న ట్వీట్‌లో కామెంట్ పెట్టాడు తేజూ. ఇక మ‌హేష్ బాబు కూడా హోలీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. హోలీ అంద‌రి జీవితాల‌లో సంతోషం, ప్రేమ నింపాల‌ని కోరుకుంటున్నాను. ఈ ఆనంద క్ష‌ణాల‌ని అంద‌రు ఆస్వాదించండని కోరాడు. మంచు విష్ణు చేసిన ట్వీట్ కాస్త భిన్నంగా ఉంది. మ‌హిళ‌ల‌ని గౌర‌వించ‌డం. అల్ల‌ర్లు సృష్టించేదిగా, వేరే వారిని ఇబ్బంది పెట్టేలా ఈ పండుగ ఉండ‌కూడద‌ని తెలియ‌జేస్తూ, హోలీ శుభాకాంక్ష‌లు తెలిపాడు.
1968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles