జయ భౌతిక కాయానికి మహేష్, వెంకీ నివాళి

Fri,August 31, 2018 03:25 PM
celebrities  condolence to jaya

ప్రముఖ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు భార్య బి. జయ గత రాత్రి పదకొండు గంటల సమయంలో గుండెపోటుతో మరణించినసంగతి తెలిసిందే. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె ఆనంద బ్రహ్మ అనే కథ రాసింది. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. ఎన్నో కథలు రాసిన జయ కాలమిస్ట్ , కార్టూనిస్ట్ గా కూడా పని చేశారు. ఆమె పార్ధివ దేహానికి మహేష్ బాబు, వంశీ పైడిపల్లి, వెంకటేష్, మంచు మనోజ్, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్రెడ్డి, నందినిరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్, గుణశేఖర్, డ్యాన్స్ మాస్టర్ శేఖర్, సుకుమార్ తదితరులు నివాళులు అర్పించారు. జయ భర్త బీఏ రాజుకి మనో ధైర్యం అందించారు.

టాలీవుడ్ మహిళా దర్శకులలో జయది ప్రత్యేక స్థానం.2003లో చంటిగాడు సినిమాతో దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన జయ చివరిగా వైశాఖం సినిమాకి డైరెక్షన్ చేశారు. జయ మరణం కలిచి వేస్తుందని క్రిష్ జాగర్లమూడి ట్వీట్ చేశారు. జయ మరణ వార్తని నమ్మలేకపోతున్నాను.అంత మంచి వ్యక్తి ఇంత తొందరగా మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. ఈ సమయంలో జయ భర్తకి, వారి కుటుంబ సభ్యులకి మనో ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్దిస్తున్నాను అని రకుల్ ట్వీట్ లో తెలిపింది.

6049
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles