రాజ‌మౌళి త‌న‌యుడి పెళ్ళి కోసం జైపూర్ త‌ర‌లి వెళ్ళిన‌ తారాలోకం

Sat,December 29, 2018 08:13 AM
celebrities attends to rajamouli son marriage

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ వివాహం పూజాల వివాహం పూజాతో ఈ నెల 30న రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. మూడు రోజుల పాటు వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప్ర‌ముఖులు జైపూర్ వెళ్ళారు. ప్రముఖ హీరోలు అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, రానా, జగపతిబాబు తదితరులు పెళ్లి వేడుక‌లో పాల్గొన‌నున్నారు. కుకాస్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో జరగనున్న పెళ్ళికి మూడొంద‌ల‌కి పైగా అతిధులు హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. సంగీత్‌, మెహందీ వేడుక‌ల‌ని గ్రాండ్‌గా జ‌రిపేందుకు ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తైన‌ట్టు స‌మాచారం. పెళ్లి కూతురు పూజా ప్ర‌సాద్ భ‌క్తి గీతాల‌ని ఆల‌పించే గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకోగా, రాజమౌళి కుమారుడు కార్తికేయ బాహుబలి చిత్రానికి దర్శకత్వం విభాగంలో పనిచేశారు. ఆయన బాహుబలి సెకండ్ యూనిట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. త్వ‌ర‌లో ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు.
Celebs At Rajamouli Son Karthikeya Wedding Photos3910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles