బ‌న్నీ స‌ర‌స‌న నాలుగోసారి ..!

Sat,March 2, 2019 12:24 PM
catherine tresa pairs with allu arjun fourth time

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌ష్మిక మంథాన లేదంటే కియారా అద్వానీని తీసుకోవాల‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట . ఇక ముఖ్య పాత్ర కోసం బెంగ‌ళూరు భామ క్యాథ‌రిన్ థెస్రాని తీసుకోనున్న‌ట్టు తెలుస్తుంది. ఇదే క‌నుక నిజ‌మైతే బ‌న్నీతో ఆమె జోడి క‌ట్ట‌డం నాలుగో సారి అవుతుంది. గ‌తంలో క్యాథ‌రిన్ బ‌న్నీ స‌ర‌స‌న ఇద్దరమ్మాయిలతో , సరైనోడు , రుద్రమదేవి చిత్రాల్లో నటించింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రాలన్ని మంచి విజ‌యం సాధించాయి. ఇదిలా ఉంటే బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ చిత్రాలుగా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి వస్తున్నఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ.. గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బేన‌ర్‌ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో బ‌న్నీని స‌రికొత్త లుక్‌లో చూపించ‌నున్నాడు త్రివిక్ర‌మ్. థ‌మ‌న్ బాణీలు స‌మ‌కూర్చ‌నున్నాడు.

2557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles