అమలా పాల్ చిత్రానికి క్యాచీ టైటిల్

Tue,April 25, 2017 02:42 PM
Catchy Title for Amala Paul Movie

అందాల భామ అమలా పాల్ ప్రస్తుతం విష్ణు విశాల్ సరసన ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిన్ మిని అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇందులో విష్ణు విశాల్ రోల్ చాలా విభిన్నంగా ఉంటుందట. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసిన యువకుడు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడనే ఇతి వృత్తంతో ఈ మూవీ రూపొందినట్టు చెబుతున్నారు . క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తుండగా, పివి శంకర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. మరో వైపు విష్ణు విశాల్ పొన్ ఒండ్రు కండెన్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం పెళ్ళి చూపులు చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక అమలా పాల్ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.


1203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles