శర్వానంద్-సమంత సినిమాలో నటించే ఛాన్స్

Mon,January 28, 2019 04:43 PM
Casting call from SVC for Sharwanand, samnatha

తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ లో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో 96 సినిమాకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

96 చిత్రంలోని మొదటి భాగంలో హీరోహీరోయిన్ల స్కూల్ డేస్ కు సంబంధించిన సన్నివేశాలు ప్రధానంగా సాగుతాయి. తెలుగులో శర్వానంద్ చిన్ననాటి (స్కూల్ డేస్) పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసే పనిలో చిత్రయూనిట్ పడింది. యంగ్ శర్వానంద్ పాత్ర కోసం చిత్రయూనిట్ కాస్టింగ్ కాల్ ను ప్రకటించింది. యంగ్ శర్వానంద్ వాంటెడ్..పేరుతో ఉన్న పోస్టర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంది. విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ లో వచ్చిన 96 చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది.
3002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles