వైర‌ల్ సాంగ్‌పై ముస్లింల కంప్లైంట్ ..!

Wed,February 14, 2018 11:22 AM
case file against viral song

మలయాళం సినిమా 'ఓరు అదార్ లవ్‌'లోని 'మానిక్యా మలారాయ పూవి' అనే సాంగ్‌లోని క్లిప్ ఎంత వైర‌ల్‌గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో కుర్రకాళ్లు మతులు పోగొడుతుంది. ప్ర‌తి ఒక్క‌రు ఈ వీడియోని షేర్ చేస్తూ త‌మ ల‌వ్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు.

మలయాళం సినిమా సాంగ్ మానిక్యా మలారాయ పూవి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ అయింది. అయితే ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ ముస్లింల మ‌నోభావాలని అగౌర‌వ‌ప‌రిచేలా ఉన్నాయంటూ కొందరు యువ‌కులు హైద‌రాబాద్‌లోని ఫ‌ల‌క్‌నుమా పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు తమ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.ముస్లిం యువ‌కులు ఎలాంటి ప్రూఫ్ స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతానికి ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని ఫ‌ల‌క్‌నుమా ఏసీపి స‌య‌ద్ ఫ‌య‌జ్ అన్నారు.5430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles