బాక్సాఫీస్ వ‌ద్ద బ‌ర్నింగ్ స్టార్ హ‌వా..!

Wed,August 14, 2019 10:30 AM
burning star roars on box office

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రీసెంట్‌గా కొబ్బ‌రి మ‌ట్ట చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. మ‌న్మ‌థుడు 2 చిత్రంతో పాటు ప‌లు స్టార్స్ సినిమాలు థియేట‌ర్స్ లో సంద‌డి చేస్తున్న‌ప్ప‌టికి సంపూ సినిమా మాత్రం మంచి వ‌సూళ్ళ‌తో దూసుకెళుతుంది. ఆగ‌స్ట్ 10న విడుద‌లైన కొబ్బ‌రి మ‌ట్ట చిత్రం మూడు రోజుల‌లో 12 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు సాదించినట్టుగా చిత్ర యూనిట్ పోస్ట‌ర్స్ ద్వారా తెలిపింది. కాక‌పోతే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఫ్యాన్స్‌ కోసం రూ. 9 కోట్ల ఫేక్‌ కలెక్షన్లు యాడ్ చేసినట్టుగా వారు తెలిపారు . అంటే మూడు రోజుల‌లో ఈ చిత్రం మూడు కోట్ల వ‌సూళ్ళు సాధించింది. అయితే సంపూ సినిమా మూడు రోజుల‌లో మూడు కోట్లు సాధించ‌డం కూడా గొప్ప విశేష‌మే అంటున్నారు. ఈ చిత్రంలో సంపూ ఆండ్రాయుడ్‌, పాపారాయుడు, పెద‌రాయుడు పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేశారు. హృదయకాలేయం సినిమా దర్శకుడు సాయి రాజేష్‌ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమాకు రూపక్‌ రోనాల్డ్‌సన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

7792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles