మూడు మిలియ‌న్స్‌కి చేరుకున్న బ‌న్నీ ఫాలోవ‌ర్స్

Sun,January 20, 2019 11:52 AM

ప్ర‌స్తుత డిజిట‌ల్ యుగంలో సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్స్ ద్వారా అభిమానుల‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. వారితో అన్ని విష‌యాలు షేర్ చేసుకుంటున్నారు. ఇటు తెలుగుతో పాటు ప‌లు రాష్ట్రాల‌కి చెందిన అభిమానుల ఆద‌ర‌ణ‌ని పొందిన అల్లు అర్జున్ ట్విట్ట‌ర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయ‌న 3 మిలియన్ (30 లక్షల మంది) ఫాలోవర్స్ మార్కుని చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని చెబుతూ.. నా పై మీరు ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అభిమానానికి నేను ధ‌న్యుడిని. నా ఫాలోవ‌ర్స్‌ మూడు మిలియ‌న్స్ మార్కు చేరుకుందంటే అది అంత మీ గొప్ప‌త‌న‌మే. ఇందులో నా బ‌లం లేదు. మీ దీవెన ఉంది అంటూ కామెంట్‌లో తెలిపాడు. 2015వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ట్విట్టర్ లోకంలో అడుగుపెట్టిన బ‌న్నీ సినిమాకి సంబంధించిన విష‌యాలే కాక ఫ్యామిలీకి సంబంధించిన విష‌యాలు కూడా అప్పుడ‌ప్పుడు అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంతో చివ‌రిగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బ‌న్నీ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ ద‌ర్శక‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు
1528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles