న్యూయ‌ర్‌కి బ‌న్నీ స్టైలిష్ గిఫ్ట్‌

Sun,December 24, 2017 10:09 AM
bunny new year gift

నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా బ‌న్నీత‌న అభిమానుల‌కి స్టైలిష్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. జ‌న‌వ‌రి 1న‌ ‘ఫస్ట్‌ ఇంపాక్ట్‌’ టీజ‌ర్‌ను విడుదల చేయనున్నట్లు అల్లు అర్జున్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 1 నిమిషం 20 సెకన్ల నిడివితో రూపొందిన వీడియోలో ఆయన గత చిత్రాల కంటే భిన్నంగా కనిపిస్తార‌ని చిత్ర బృందం చెబుతుంది. బ‌న్నీ తాజా చిత్రం నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ తో తెర‌కెక్కుతుండ‌గా ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. 2018 ఏప్రిల్ 27న విడుద‌ల కానున్న ఈ చిత్రం కోసం బ‌న్నీ త‌న మేకొవ‌ర్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.



1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles