ఏడు భాష‌ల‌లో రిలీజ్ కానున్న బ‌న్నీ తాజా చిత్రం

Sun,January 21, 2018 02:18 PM
bunny movie releases in 7 languages

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు ప్ర‌క్క రాష్ట్రాల‌లోను విప‌రీతంగా ఉంది. బ‌న్నీ న‌టించిన సినిమాలు డ‌బ్బింగ్ జరుపుకొని త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కాగా అక్క‌డ కూడా వాటికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ క్ర‌మంలో బ‌న్నీ తాజా చిత్రం నా పేరు సూర్యని ఏడు భాష‌ల‌లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు, మ‌ల‌యాళం, హిందీ భాషల‌లో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని ముందుగానే భావించిన‌ప్ప‌టికి, రీసెంట్‌గా తమిళం.. మరాఠి.. బెంగాలీ.. భోజ్ పురి భాషల్లోనూ ‘నా పేరు సూర్య’ను రిలీజ్ చేయాల‌ని ప్రణాళిక‌లు వేస్తున్నార‌ట‌. ఈ విష‌యంపై బ‌న్నీ కూడా పాజిటివ్‌గా ఉండ‌డంతో ఏప్రిల్‌లో నా పేరు సూర్య ఏడు భాష‌ల‌లో విడుద‌ల అవ‌తుంద‌ని అంటున్నారు. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.

2353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles