త‌దుప‌రి సినిమాపై స్పందించిన అల్లు అర్జున్

Wed,November 7, 2018 10:41 AM
bunny gives clarity on his project

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివ‌రి చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ త‌దుపరి ప్రాజెక్ట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ నెక్ట్స్ మూవీ ఉంటుంద‌ని మొద‌ట ప్ర‌చారం జ‌రిగిన‌, ఆ త‌రువాత బ‌న్నీని త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ చిత్రాలుగా నిలిచాయి. ముచ్చటగా మూడోసారి ఈ కాంబో మ్యాజిక్ చేస్తార‌ని అభిమానులు ఆశిస్తున్నారు. బ‌న్నీ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి దీపావ‌ళికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ , త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ కోసం ఇన్నాళ్ళు వేచి చూసిన అభిమానుల‌కి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. అతి త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నున్నాం. ఇంత‌గా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు అని బ‌న్నీ పేర్కొన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. బన్నీతో సినిమా అంటే ఆరంభం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. క్రేజీ కాంబినేషన్ లో మూవీ రాబోతుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


1910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS