యాక్షన్, ఎమోషన్స్ తో అదరొగొట్టిన బన్నీ

Mon,January 1, 2018 05:06 PM

వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రంలో అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. 2018 ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రం కోసం బన్నీ తన మేకొవర్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అయితే న్యూ ఇయర్ సందర్భంగా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి విదేశాలకి వెళ్లిన బన్నీ జనవరి 4 నుండి యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటాడట . అయితే న్యూ ఇయర్ కానుకగా బన్నీతన అభిమానులకి స్టైలిష్ గిఫ్ట్ ఇచ్చాడు. 1 నిమిషం 12 సెకన్ల నిడివితో రూపొందిన వీడియెని ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ గా విడుదల చేశాడు. ఇందులో బన్నీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అభిమానులలో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.


2256
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles