కేర‌ళ‌లో బ‌న్నీ దంప‌తుల సంద‌డి

Sun,November 11, 2018 06:36 AM
bunny family attends to the boat race festival

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిందంటే అక్క‌డి అభిమానులు ఎగ‌బ‌డి మ‌రి సినిమా చూస్తుంటారు. ఇటీవ‌ల కేర‌ళ‌లో వ‌చ్చిన వ‌ర‌ద బీభ‌త్సానికి ఎందరో నిరాశ్ర‌యులు కాగా, వారికి త‌న వంతు సాయంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. దీంతో రియ‌ల్ హీరోగాను బ‌న్నీ మ‌ల‌యాళ అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. అయితే నవంబర్ 10న కేర‌ళ ప్ర‌భుత్వం నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ నిర్వ‌హించింది. కేరళలోని అలప్పుజలో 66వ నెహ్రూ ట్రోపీ బోట్ రేస్ ఫెస్టివల్‌కు బ‌న్నీ త‌న స‌తీమ‌ణి స్నేహా రెడ్డితో క‌లిసి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. బన్నీకి అక్క‌డ అభిమానులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు . అలప్పుజలోని పున్నంద సరస్సులో ఏర్పాటు చేసిన బోట్ ఫెస్టివల్ లో జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ అల్లు సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. కేరళ అంటే తనకు ఎంతో అభిమానమని, ఈ అభిమానాన్ని తాను కలకాలం గుర్తుంచుకుంటానని తెలిపారు . ‘‘66వ నెహ్రూ ట్రోపీ బోట్ రేస్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి, జెండా ఊపి పోటీలను ప్రారంభించే అవకాశం కల్పించిన కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ గౌరవాన్ని అందించిన కేరళ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. బ‌న్నీ త్వ‌ర‌లో త్రివిక్రమ్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు సన్న‌ద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.


1685
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles