ఫ్యాన్స్‌కి డ‌బుల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన బ‌న్నీ

Thu,May 30, 2019 11:21 AM
bunny double bonanza comes next year

బ‌న్నీ న‌టించిన నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా చిత్రం విడుద‌లై దాదాపు సంవ‌త్స‌రం దాటింది. ఆయ‌న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం బ‌న్నీ.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి కాగా, రెండో షెడ్యూల్ జూన్ 4 నుండి 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ చేస్తున్న‌ ఐకాన్ సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఏక‌కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్ జ‌రిపి, వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని అనుకుంటున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, ఐకాన్ చిత్రం స‌మ్మ‌ర్‌లో రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు. మొత్తానికి ఏడాది గ్యాప్ ఇచ్చిన బ‌న్నీ వ‌చ్చే ఏడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ ఇవ్వ‌నున్న‌డ‌న్న‌మాట.

2118
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles