నిర్మాణం వైపు దృష్టి పెట్టిన బ‌న్నీ..!

Wed,January 9, 2019 08:19 AM

గంగోత్రి సినిమాతో హీరోగా వెండితెర‌కి ప‌రిచ‌య‌మైన అల్లు అర్జున్ కెరియర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరో స్టేట‌స్ అందుకున్నాడు. ఇప్పుడు బ‌న్నీకి కేవ‌లం తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు ప‌క్క రాష్ట్రాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే బన్నీ న‌టించిన చివ‌రి సినిమా నా పేరు నా ఇల్లు ఇండియా చిత్రం ఫ్లాప్ కావ‌డంతో త‌దుపరి చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్‌గా త‌న 19వ చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. క‌ట్ చేస్తే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. మ‌హేష్ బాబులా మ‌ల్టీ ప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పటికే వేరు వేరు వ్యాపార రంగంలో రాణిస్తున్న అల్లు అర్జున్ అమీర్ పేట్ స‌త్యం థియేట‌ర్‌ని మల్టీ ప్లెక్స్‌గా మార్చేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని కొంద‌రు అన్నారు. మ‌రి కొంద‌రు సిటీ సెంటర్‌లో ఓ ప్రముఖ థియేటర్‌ ఉన్న స్థలాన్ని మల్టీప్లెక్స్‌ నిర్మాణానికి సెలెక్ట్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. తాజాగా బ‌న్నీ సొంత నిర్మాణ సంస్థ‌ని స్థాపించి అందులో సీరియ‌ల్స్ లేదా రియాలిటీ షోస్ చేయాల‌నుకుంటున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ నుంచి గీతా ఆర్ట్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

1837
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles