అల్లు అర్జున్ కారవాన్ ఖ‌రీదు ఎంతో తెలుసా ?

Tue,June 18, 2019 01:31 PM
bunny car van special attraction in set

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌ను వాడే ప్రాప‌ర్టీస్ అన్నీ చాలా స్టైలిష్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ముఖ్యంగా అత‌ని కారవాన్ ని ముంబైకి చెందిన వ్య‌క్తికితో ప్ర‌త్యేకంగా త‌యారు చేయించుకున్నాడ‌ట బ‌న్నీ. మూడు కోట్లు పెట్టి ఇంటీరియ‌ర్ డెక‌రేష‌న్ చేయించుకోగా, ఈ కార్ వ్యాన్ ధ‌ర రూ. 7 కోట్ల పై మాటే అంటున్నారు. ఇంత ల‌గ్జ‌రీ కారవాన్ ని దేశంలో ఏ హీరో కూడా వాడ‌డం లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ కారవాన్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంద‌ట‌. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా త‌ర్వాత బ‌న్నీ త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 19వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. చిత్రం ప్ర‌ధాన పాత్ర‌ధారులు అంద‌రు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ట‌బు, స‌త్య‌రాజ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. అల్లు అర్జున్ 19వ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

22207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles