క్రికెట‌ర్ బ‌యోపిక్‌తో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వ‌నున్న బ‌న్నీ!

Fri,September 7, 2018 12:59 PM
BUNNY BOLLYWOOD DEBUT WITH KAPIL BIOPIC

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల‌కి మార్కెట్ వాల్యూ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ‌న్నీకి త‌మిళంలోను ఆద‌ర‌ణ బాగానే ఉంది. ఇక బ‌న్నీ టార్గెట్ బాలీవుడ్ అని చెబుతుండ‌గా, త్వ‌ర‌లోనే అది జ‌ర‌గ‌నుంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో చ‌ర్చించుకుంటున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న బ‌న్నీ త్వ‌ర‌లో విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ సినిమాలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు.

బ‌న్నీ బాలీవుడ్ ఎంట్రీపై కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా,ఆయ‌న బీటౌన్ డెబ్యూ లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్‌తో ఉంటుంద‌ని చెబుతున్నారు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా మూవీ తెరకెక్క‌నుంది. ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌ని ర‌ణ‌వీర్ సింగ్ పోషిస్తుండ‌గా, ఇండియ‌న్ క్రికెట‌ర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో బ‌న్నీ న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. చిత్ర ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్.. బ‌న్నీ పాత్ర‌ని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేయ‌డంతో ఆ సినిమాలో న‌టించేందుకు బ‌న్నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం.

2020లో ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రం 83 అనే టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.

3032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles