మార్చి 16 నుండి చిత్ర షూటింగ్స్ కూడా బంద్‌

Wed,March 14, 2018 08:41 AM
bundh still continues in tamil industry

డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడర్స్, నిర్మాత‌ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో మార్చి 2న మొద‌లైన బంద్ త‌మిళ సిని ప‌రిశ్ర‌మ‌లో ఇంకా కొన‌సాగుతుంది. తెలుగు రాష్ట్రాల‌లో బంద్‌ని మార్చి 9న విర‌మించుకున్న‌ప్ప‌టికి త‌మిళ నిర్మాత‌లు మాత్రం ప‌ట్టుబ‌ట్టుకు కూర్చున్నారు. బంద్ వ‌ల‌న త‌మిళ సినిమాకి భారీ న‌ష్టం చేకూరుతుంద‌ని తెలిసిన కూడా, ఇప్పుడు బంద్‌ నిలిపివేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని భావించిన తమిళ నిర్మాతల మండలి కఠిన నిర్ణయాలు తీసుకుంది. మ‌రో విష‌యం ఏమంటే ఈ నెల 16 నుండి చెన్నైలో తమిళంతోపాటు ఇతర భాషా చిత్రాల షూటింగ్‌ నిలిపివేయాలని, 23వ తేదీ నుండి అవుట్‌డోర్‌ షూటింగ్‌, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సైతం తమిళ చిత్రాలకు సంబంధించిన షూటింగ్‌లు కూడా జరుపకూడదని నిర్ణయించినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

మార్చి 16 నుంచి పోస్టు ప్రొడక్షన్‌ పనులు కూడా జరుపకూడదని నిర్ణయించిన సంఘం గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్టు కొత్త చిత్రాల‌ని కూడా విడుద‌ల చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. ఇక సినిమా ప్రారంభోత్సవాలు, ఆడియో వేడుకలు, పూజా కార్య‌క్ర‌మాలు, టీజ‌ర్ విడుద‌ల‌, పేప‌ర్స్ ప్ర‌క‌ట‌న వంటి ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ని కూడా నిలిపివేస్తున్న‌ట్టు త‌మిళ సంఘం ప్ర‌క‌టించింది. క‌న్న‌డ ప‌రిశ్ర‌మ కూడా ఇదే దారిలో వెళ్ళేందుకు సిద్ధ‌మ‌వుతుంది. డీఎస్పీలు తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఇతర రాష్ట్రాల నుండి డీఎస్పీలను తీసుకొచ్చేందుకు వెనుకాడబోమని విశాల్‌ స్పష్టం చేశారు. అయితే ప్ర‌స్తుతం త‌మిళ రాష్ట్రాల‌లోని థియేట‌ర్స్‌లో పాత సినిమాల‌ని రీరిలీజ్ చేస్తున్నార‌ట‌. ఈ బంద్ కార‌ణంగా త‌మిళ పరిశ్ర‌మ‌కి దాదాపు 50 కోట్ల వ‌ర‌కు న‌ష్టం వాటిలిన‌ట్టు అంచ‌నా.


2328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles