పాయ‌ల్ రాజ్‌పుత్ మాస్ మ‌సాలా సాంగ్‌.. ఫుల్ వీడియో

Sat,June 15, 2019 09:05 AM
BulReddy Video Song released

ఆర్‌ఎక్స్100 సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన పాయల్‌రాజ్‌ఫుత్ ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది . తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్ర‌స్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించ‌నుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్టులు చేస్తుంది పాయ‌ల్‌. అయితే సీత సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెంగర్ల్‌గా అవతారమెత్తింది. ‘బుల్‌ రెడ్డి...’ అనే పెప్పీ మాస్‌ సాంగ్‌లో పాయ‌ల్ మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది. ఇందులో పాయల్ అభినయం, నృత్యాలు, గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఆ సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. ఇది అభిమానుల‌ని అల‌రిస్తుంది.

సీత చిత్రం ఓ అభినవ సీత కథ . ఆమె క్షేమం కోసం రాముడి లాంటి యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది చిత్రంలో చూపించారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్‌ గోమటం, అభిమన్యుసింగ్‌ నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది.

3513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles