పాయల్‌ రాజ్‌ఫుత్ ఐటెం సాంగ్ వీడియో

Wed,April 10, 2019 11:47 AM
BulReddy Video Song Promo video

ఆర్‌ఎక్స్100 సినిమాతో కథానాయికగా పరిచయం అయిన పాయల్‌ రాజ్‌ఫుత్ ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది . తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్ర‌స్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించ‌నుంది. త‌మిళంలోను ప‌లు ప్రాజెక్టులు చేస్తుంది పాయ‌ల్‌. అయితే సీత సినిమా కోసం పాయల్ రాజ్‌పుత్ ఐటెం గార్ల్ అవతారమెత్తింది. ‘బుల్‌ రెడ్డి...’ అనే పెప్పీ మాస్‌ సాంగ్‌లో అభినయం, నృత్యం, గ్లామర్ తో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇటీవల చిత్ర లిరికల్ సాంగ్ విడుదల చేసిన టీం తాజాగా ‘బుల్‌ రెడ్డి...’ సాంగ్ వీడియో ప్రోమో విడుదల చేసారు.

సీత చిత్రం ఓ అభినవ సీత కథ . ఆమె క్షేమం కోసం రాముడి లాంటి యువకుడు ఎలాంటి పోరాటం చేశాడన్నది చిత్రంలో చూపించారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సీత’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్‌ గోమటం, అభిమన్యుసింగ్‌ నటించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క మెప్పిస్తుంద‌ని టీం చెబుతుంది. సీత చిత్రం ఏప్రిల్ 25న విడుద‌ల కానుంది.

1420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles