`బుజ్జి బంగారం` పాట విడుద‌ల చేసిన బ్రహ్మీ, అలీ

Mon,July 15, 2019 08:22 PM
Bujji bangaram from guna 369 lyrical vedio song


`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ, అన‌ఘ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `గుణ 369`. అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రంలోని తొలి పాట‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌`రాజు విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. తాజాగా `బుజ్జి బంగారం` అంటూ సాగే రెండో పాటను ప్ర‌ముఖ హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, అలీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌ను బ్ర‌హ్మానందం ఆశీర్వ‌దించారు.
శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు.

958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles