బ్రూనో మార్స్‌కు ఆరు గ్రామీలు

Mon,January 29, 2018 12:19 PM
Bruno Mars wins six Grammy awards

న్యూయార్క్: గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో బ్రూనో మార్స్ టాప్‌గా నిలాచాడు. ఈ ఏడాది బ్రూనో మార్స్‌కు ఆరు గ్రామీలు దక్కాయి. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ట్రోఫీని కూడా అతనే గెలుచుకున్నాడు. కెండ్రిక్ లామర్ టీమ్‌ను అప్‌సెట్ చేసిన బ్రూనో అనూహ్యంగా గ్రామీ షోలో అత్యధిక అవార్డులను దక్కించుకున్నాడు. కెండ్రిక్ లామర్‌కు అయిదు గ్రామీలు దక్కాయి. పాప్ స్టార్లు లేడీ గాగా, యూ2, లామర్, రిహాన్నా, ఎల్టన్ జాన్, మిలే సైరస్‌లు ప్రత్యేక షో నిర్వహించారు. న్యూయార్క్ సిటీలోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లో ఈ ఈవెంట్ జరిగింది. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డును అలెసియా కారా గెలుచుకున్నది. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్(24కే మ్యాజిక్), రికార్డర్ ఆఫ్ ద ఇయర్ (24కే మ్యాజిక్), సాంగ్ ఆఫ్ ద ఇయర్ (దట్స్ వాట్ ఐ లైక్), బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్(24కే మ్యాజిక్)లను బ్రూనో మార్స్ గెలుచుకున్నాడు. షేప్ ఆఫ్ యూ సాంగ్‌తో హిట్ కొట్టిన ఎడ్ షీరన్‌కు బెస్ట్ పాప్ ఆల్బమ్ క్యాటగిరీలో అవార్డు దక్కింది. ద వార్ ఆన్ డ్రగ్స్‌కు బెస్ట్ రాక్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. కెండ్రిక్ లామర్‌కు చెందిన డామ్ ఆల్బమ్‌కు బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ అవార్డు దక్కింది.

1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles