ఎవ‌రీ ‘డైసీ ఎడ్గార్‌ జోన్స్‌’ ?

Fri,March 15, 2019 08:42 AM
brief history of Daisy Edgar Jones

‘డైసీ ఎడ్గార్‌ జోన్స్‌’ ఈ పేరు నిన్న జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో రాజ‌మౌళి నోటి నుండి వ‌చ్చే సరికి అంద‌రు అవాక్క‌య్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీంగా న‌టిస్తున్న ఎన్టీఆర్ స‌ర‌స‌న ‘డైసీ ఎడ్గార్‌ జోన్స్‌’ నటిస్తుంద‌ని రాజ‌మౌళి చెప్పేస‌రికి ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజ‌న్స్ పూర్తి ఆరాలు తీసారు. బ్రిట‌న్‌కి చెందిన ఈ న‌టి ‘కోల్డ్‌ ఫీట్‌’, ‘వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌’, ‘జెంటిల్‌మాన్‌ జాక్‌’, ‘సైలంట్‌ విట్‌నెస్‌’, ‘ఔట్‌ నంబర్డ్‌’ తదితర టీవీ సిరీస్‌, టీవీ షోల్లో నటించింది. గతేడాది ‘పాండ్‌ లైఫ్‌’ అనే సినిమాలో కాషీ అనే పాత్రలో నటించింది. దీంతోపాటు ‘ది రిలెక్ట్యుంటె ఫండమెండలిస్ట్‌’లో నాటకంలోనూ, ‘వింటర్‌ సాంగ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో కనిపించింది.

చ‌దువులో పెద్ద‌గా రాణించ‌ని డైసీ ఐదేళ్ళ వ‌య‌స్సులోనే నట‌నా రంగంలోకి అడుగుపెట్టింది. ఇంగ్లాండ్‌లోని నేషనల్‌ యూత్‌ థియేటర్‌లో 14 ఏళ్ల వయసులో డైసీ జాయిన్‌ అయ్యింది. ఎంతో గొప్ప టాలెంట్ ఉన్నవారికి మాత్ర‌మే ఇందులో చోటు ద‌క్కుతుంది. ఈ అమ్మ‌డు తొలి ప్ర‌య‌త్నంలోనే ఇందులో చోటు ద‌క్కించుకొని శ‌భాష్ అనిపించుకుంది. అమెరికన్‌, ఐరిష్‌ యాసలో మాట్లాడగలుగుతుంది. గిటార్‌ వాయించడం, పాటలు పాడటం అంటే ఆమె హాబీ. విరామాల‌లో చ‌క్క‌ర్లు కొట్టే డైసీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. ‘త్రో బ్యాక్‌’ పేరుతో ఎప్పటికప్పుడు ‘పాత’ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది డైసీ. డైసీకి గులాబీలన్నా, టాటూలన్నా ఇష్టం. అందుకే ఆ రెండింటినీ కలిపి భుజం మీద గులాబీ టాటూగా వేయించుకుందని అంటుంటారు. డైసీ అంత పెద్ద పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌న‌ప్ప‌టికి రాజమౌళి దృష్టిని ఆక‌ర్షించిందంటే ఈ అమ్మ‌డులో ప్ర‌త్యేక టాలెంట్ ఎంతో కొంత ఉండే ఉంటుందని చెప్పొచ్చు. మ‌రి ఇంగ్లీష్ భామ రాజ‌మౌళి సినిమాతో ఎంత‌గా పాపుల‌ర్ అవుతుందో చూడాలి.

2358
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles