రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బ్రహ్మోత్సవం ?

Wed,April 13, 2016 08:15 AM
brahmotsavam movie release date

ఆలయాలలో బ్రహ్మోత్సవాలు జరగడానికి కొన్ని నియమాలున్నాయి. కొన్ని సందర్భాలు, తేదీలు ఉన్నాయి. అప్పుడు మాత్రమే అవి జరుగుతుంటాయి. మహేష్ బాబు చేస్తున్న బ్రహ్మోత్సవం మూవీ రిలీజ్ కు కూడా ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాల మాదిరి కొన్ని నియమాలను పాటిస్తున్నారా అనిపిస్తోంది.

ఏదైనా మూవీకి ప్రారంభోత్సవానికి, విడుదలకు ముహూర్తాలు పెట్టుకుంటారు. ఉత్సవాలకు కూడా అలానే ఉంటాయి . ఇప్పుడు మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవం కోసం కూడా విడుదల ముహూర్తం పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 24న ఆడియో వేడుకని నిర్వహించి, మే 6 న సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని, కలెక్షన్స్ కూడా బాగా వస్తాయని ఆ సినిమా యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

ఈమధ్య కొన్ని రోజులు వారణాసి లో షూటింగ్ చేసుకొచ్చిన బ్రహ్మోత్సవం యూనిట్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చివరి షెడ్యూల్ షూటింగ్ చేస్తోంది. ఈనెల 10 కల్లా ఫిలింసిటీలో షూటింగ్ కంప్లీట్ చేయాలని, ఆ తర్వాత రెండు పాటలను పూణె లో పిక్చరైజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈలోగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి, సెన్సార్ కు రెడీ అయి, మే 6కు సినిమా విడుదల చేయాలని బ్రహ్మోత్సవం నిర్వాహకులు భావిస్తున్నట్టు టాక్.

3207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles