డీజే మూవీపై హెచ్‌ఆర్‌సీలో బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదు

Wed,June 14, 2017 04:14 PM
brahmin committees lodged complaint on dj movie


హైదరాబాద్: డీజే సినిమాపై బ్రాహ్మణ సంఘాలు హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశాయి. డీజే సినిమాలో అభ్యంతరకరమైన పాట, సన్నివేశాలున్నాయని బ్రాహ్మణసంఘాలు తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ సినిమాలో అభ్యంతరకర పాట, సీన్లు ఉంటే తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదుపై విచారణ జరిపించాలని సీఎస్, సినిమాటోగ్రఫీ, ప్రాంతీయ సెన్సార్‌బోర్డు కమిషనర్‌కు హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంపై ఈ నెల 19లోగా నివేదిక ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ నిర్దేశించింది.

డీజే సినిమాలో గుడిలో బడిలో మడిలో పాటలోని సాహిత్యం బ్రాహ్మణులని అవమానపరిచే విధంగా ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో..పదాలు మార్చి పాట విడుదల చేస్తామని డైరెక్టర్ హరీష్ శంకర్ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు తెలిపిన విషయం తెలిసిందే.

1525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles