బ్రహ్మానందానికి ముంబైలో బైపాస్ సర్జరీ

Wed,January 16, 2019 01:17 PM

ప్రముఖ సినీహాస్య నటుడు బ్రహ్మానందం (62) ఆరోగ్య పరిస్థితి హటాత్తుగా విషమించడంతో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం బైపాస్ సర్జరీ జరిపారు. డాక్టర్ రమాకాంత్ పండా నేతృత్వంలోని వైద్యబృందం ఆయనకు ఆపరేషన్ చేసినట్టు తెలిసింది. ఆపరేషన్ తర్వాత బ్రహ్మానందం ఆరోగ్యం స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్‌లో ఉంచారు. దశాబ్దాలుగా ఆయన తెలుగు వెండితెరను తన విశిష్టమైన హాస్యంతో అలరిస్తున్న బ్రహ్మానందం అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు గుప్పుమనడంతో ఆయన అశేష అభిమానులు కలత చెందారు. సత్వరమే ఆయన కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పెట్టారు.

6166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles