రీల్ లో కాదు రియల్ గా తాతయ్యాడు

Thu,April 13, 2017 01:58 PM
brahmanandam to be proud as grand father

కామెడీ కి కేరాఫ్‌ అడ్రెస్ ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చేది బ్రహ్మనందం. ఎన్నో సినిమాలలో విబిన్న పాత్రలు పోషించి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్రహ్మి రియల్ లైఫ్‌ లో తాతయ్యాడు. బ్రహ్మి తనయుడు గౌతమ్- జ్యోత్స్న దంపతులకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. హనుమాన్ జయంతి రోజు దంపతులకి మగ బిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులలో ఆనందం వెల్లివిరిసింది. అయితే బ్రహ్మనందం తాజాగా తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. మనవడి రాకతో ఇల్లు సంతోషవనమైందని చెప్పారు.. ఇదిలా ఉంటే పల్లకిలో పెళ్ళి కూతురు, బసంతి చిత్రాలతో అలరించిన గౌతమ్ మరో సినిమాతో మనముందుకు వస్తున్నాడు. ఫణీంద్ర నరిసెట్టి దర్వకత్వంలో మను అనే చిత్రం చేస్తున్న గౌతమ్ ఈ మూవీని మే నెలలో థియేటర్స్ లోకి తీసుకురానున్నట్టు సమాచారం. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది.

1474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles